Brahmamudi : ఏ భర్త ఇవ్వని ఆఫర్ భార్యకి ఇచ్చిన రాజ్.. షాక్ లో కావ్య!
on Sep 19, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -518 లో.....ఇందిరాదేవి సీతారామయ్యలు కావ్య దగ్గరికి వస్తారు. తను రానని చెప్పడంతో తిరిగివెళ్ళిపోతారు. ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్లేసరికి అందరూ కావ్య కోసం వెయిట్ చేస్తుంటారు. కావ్య రాకపోవడంతో ఆ మహారాణి ఎక్కడ కార్ లో ఉందా కార్ డోర్ నేనే తీసి తనని తీసుకొని రావాలా అని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. రానని చెప్పిందని ఇందిరాదేవి చెప్తుంది. నాకు తెలుసు తనకి పొగరు అని నేను ఇప్పుడు వెళ్లి కాళ్ళు పట్టుకొని రమ్మని బ్రతిమాలాలా అని రాజ్ అంటాడు. నువ్వు వెళితే కావ్య వస్తుందని ఇందిరాదేవి చెప్తుంది.
ఎక్కడ రాజ్ వెళ్లి తీసుకొని వస్తాడో అని రుద్రాణి... కావ్య అంత పొగరు గా వెళ్ళిందంటూ అనగానే రుద్రాణిపై స్వప్న విరుచుకుపడుతుంది. మొదట రాజ్ వెళ్ళానని చెప్పినా అపర్ణ కోసం వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్ వెళ్తే కావ్య వస్తుంది. కావ్యని ఎలా ఆపాలని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే స్వప్న రావడం చూసి కావాలనే రాహుల్ తో.. ఇప్పుడు కావ్య ఇంటికి వస్తే గొడవలు అవుతాయి. దాంతో అపర్ణ వదిన ఆరోగ్యం ఎలా ఉంటుందని రుద్రాణి అనడం విన్న స్వప్న వెంటనే.. కావ్యకి ఫోన్ చేసినట్టు నటిస్తూ.. ఇప్పుడు రాజ్ వచ్చాడు. నువ్వు రాకు.. ఒకవేళ వస్తే.. మా అత్త, రాహుల్ చేసే ప్లాన్ లు వర్కవుట్ అవ్వవని స్వప్న అంటుంది. ఏంటి ఒకసారి ఫూల్ అయ్యానని ఎప్పుడు అలాగే అవుతానా అంటూ స్వప్న తన అత్త కీ జలక్ ఇస్తుంది. ఇంత తెలివి గల దానివి.. నువ్వు ఎలా పడగొట్టావ్ రా అని రాహుల్ తో రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. కావ్య తన పని తను చూసుకుంటుంది. ఏంటి పట్టించుకోవడం లేదని రాజ్ అంటాడు. ఏం చేయమంటారు ఎదరువచ్చి మీ కాళ్ళపై పడమంటారా అంటూ కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. పదా ఇంటికి వెళదాం.. నువ్వు లేకపోతే మా ఇల్లు చీకటి అయిందట.. నువ్వు వచ్చి దీపం వెలిగించమని రాజ్ వెటకారంగా మాట్లాడతాడు. నేను రాను. ఈ జన్మలో ఆ ఇంట్లో అడుగుపెట్టను.. మీరేం చెప్పినా, ఏం చేసిన రానని కావ్య కచ్చితంగా చెప్తుంది. తరువాయి భాగంలో నీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను.. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వని ఆఫర్ అని రాజ్ అనగానే.. ఏంటని కావ్య అడుగుతుంది. మా ఇంట్లో కోడలిగా నటించడానికి ఎంత కావాలంటూ చెక్ పై సైన్ చేస్తుంటే.. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read